కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. కార్మికులు పోరాటం చేసి సాధించుకున్న హక్కులను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు.