సంగారెడ్డి మండలం ఫసల్ వాది శివారులోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఆదివారం ఉచిత సంగీత, నృత్య, కీబోర్డ్ శిక్షణ శిబిరం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఈ శిబిరం, ప్రతి ఒక్కరూ భారతీయ సంగీతం, నృత్యం నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినట్లు వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు.