జీఎస్టీ ధరల తగ్గింపుతో పేదలకు మేలు జరుగుతుందని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కసిరి వాసు అన్నారు. సంగారెడ్డిలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, ఈ నిర్ణయాన్ని అన్ని వర్గాల ప్రజలు హర్షిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు విజయ్ కుమార్, ద్వారకా రవి పాల్గొన్నారు.