సంగారెడ్డి: నేడు భారీ వర్షాలు

హైదరాబాద్ ఐఎండి తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సంగారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్