సంగారెడ్డిలో పాస్‌పోర్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం సంగారెడ్డిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పాస్‌పోర్ట్ కేంద్రం కోసం ఇప్పటికే సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఎడ్యుకేషనల్ హబ్ గా పేరుగాంచిన సంగారెడ్డిలో కేంద్రం లేకపోవడం సరికాదని ఆయన పేర్కొన్నారు.