పెండింగ్‌లో ఉన్న స్కాలర్ షిప్స్, రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని కోరుతూ సంగారెడ్డిలో శనివారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు భిక్షాటన చేశారు. జిల్లా అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ, స్కాలర్ షిప్స్, రియంబర్స్మెంట్ చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తుందని విమర్శించారు. బకాయిలు చెల్లించే వరకు వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగుతాయని తెలిపారు.