సంగారెడ్డి పట్టణంలో కుక్కల నియంత్రణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ డిమాండ్ చేశారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత నెల రోజుల్లో 12 మంది పిల్లలు కుక్కల కాటుకు గురయ్యారని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి అధికారులకు విన్నవించినా వారు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.