సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం యువజనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 19 మంది విద్యార్థినులు, యువకులు తమ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఉత్తమ ప్రదర్శనను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని జిల్లా యువజన అధికారి ఖాసింభేగ్ తెలిపారు.