అదరగొట్టిన ఎస్‌బీఐ.. లాభం రూ.20,160 కోట్లు

ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం SBI ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.20,160 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో ఈ మొత్తం రూ.18,331 కోట్లుగా ఉండగా, ఈసారి 10 శాతం వృద్ధి నమోదైంది. సమీక్షా త్రైమాసికానికి ఎస్‌బీఐ మొత్తం ఆదాయం రూ.1,29,141 కోట్ల నుంచి రూ.1,34,979 కోట్లకు పెరిగింది. బ్యాంకుల ఆస్తుల నాణ్యత కూడా మెరుగైంది.

సంబంధిత పోస్ట్