అంతరిక్షం నుంచి భూమిని చూస్తే అద్భుతంగా ఉందని భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అన్నారు. ఐఎన్ఎస్ నుంచి కొన్ని ఫొటోలు తీసుకొచ్చామని.. ఈ మిషన్ కోసం మన శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడ్డారన్నారు. తాను సేకరించిన సమాచారం గగన్‌యాన్ మిషన్ కోసం పనిచేస్తుందన్నారు. భారతీయుల కలను నెరవేర్చడం తనకు గర్వకారణంగా ఉందని.. అంతరిక్ష యానం కోసం శరీరాన్ని సిద్ధం చేసుకోవడం మరిచిపోలేని అనుభూతి అన్నారు.