తెలంగాణలో తొలివిడత జనగణన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మంత్రి పొన్నం ప్రభాకర్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ నిర్వహించారు. అధికారుల సమక్షంలో మంత్రి స్వయంగా తన కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు. ప్రజలంతా స్వీయ గణనలో పాల్గొని తమ కుటుంబ వివరాలను నమోదు చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఖచ్చితమైన జనాభా గణాంకాల కోసం ఇది కీలకమని తెలిపారు. దేశంలోనే తెలంగాణ ముందంజలో నిలిచేలా సెల్ఫ్ ఎన్యూమరేషన్‌ను విజయవంతం చేయాలని కోరారు.