నువ్వులను తినడం వల్ల ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలున్నాయని నిపుణులు తెలిపారు. వీటిలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాట్లు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంతో పాటు, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. వృద్ధాప్య లక్షణాలను దూరం చేసి, ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచి, జీర్ణక్రియను సులభతరం చేయడంలో నువ్వులు కీలక పాత్ర పోషిస్తాయి.