కేరళలో, ఖమ్మం, హైదరాబాద్‌లో ఇటీవల మగపిల్లలపై లైంగిక వేధింపుల కేసులు వెలుగు చూశాయి. కేరళలో టెకీ స్టూడెంట్ లైంగిక వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మం జిల్లా మైనారిటీ బాయ్స్ స్కూల్‌లో టీచర్ బాలుడిని వేధించినట్లు ఫిర్యాదు వచ్చింది. సైదాబాద్ జువైనల్ హోంలో స్టాఫ్ గార్డ్ ఐదుగురు బాలురను వేధించాడు. ఇలా దేశంలో పలు చోట్ల మగపిల్లలపైనా లైంగిక వేధింపులు జరగడం ఆందోళన కలిగిస్తుందని నిపుణులు చెప్తున్నారు. పిల్లలను వేధించే కామాంధులను వెంటనే శిక్షించాలని కోరుతున్నారు.