మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఖక్నార్ హెల్త్ సెంటర్‌లో గత సంవత్సరం రికార్డైన ఒక సీసీటీవీ ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. అందులో, పోస్ట్‌మార్టం కోసం ఉంచిన ఒక మహిళ మృతదేహాన్ని ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు కనిపించింది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, 25 ఏళ్ల నిలేష్ భిలాలాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు పోస్ట్‌మార్టం వార్డులోకి ఎలా ప్రవేశించాడనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.