ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో దారుణ ఘటన జరిగింది. సీఎంఐ (CMI) హాస్పిటల్‌లో ఒక వ్యక్తి నర్సింగ్ సిబ్బందితో లైంగిక వేధింపులకు పాల్పడి, రూ.10 వేలు తీసుకుని తనతో రండి అంటూ.. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళా సిబ్బంది, ఆ యువకుడికి దేహశుద్ది చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.