వాట్సప్‌ స్క్రీన్‌ షేర్‌ చేస్తే మీ ఖాతా ఖాళీ!

సైబర్‌ నేరగాళ్లు కొత్తగా వాట్సప్‌ స్క్రీన్‌ షేరింగ్‌ మోసాలతో ప్రజలకు ఉచ్చు వేస్తున్నారు. బ్యాంకు లేదా కస్టమర్‌ సపోర్ట్‌ పేరుతో ఫోన్‌ చేసి, అకౌంట్‌ బ్లాక్ అవుతుందంటూ భయపెట్టి స్క్రీన్‌ షేర్ చేయిస్తారు. ఒక్కసారి షేర్ చేస్తే, పిన్‌, ఓటీపీ, పాస్‌వర్డ్ అన్నీ వారి చేతికి వెళ్లి ఖాతాలోని డబ్బు మొత్తం ఖాళీ అవుతుంది. ఎవరూ స్క్రీన్‌ షేర్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్