వేధించాడని నడిరోడ్డుపై చెప్పుతో కొట్టింది (వీడియో)

AP: మద్యం మత్తులో వేధించిన యువకుడిని ఓ యువతి నడిరోడ్డుపై చెప్పుతో కొట్టింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. హౌసింగ్ బోర్డులోని లిక్కర్ షాపు వద్ద మద్యం తాగిన యువకుడు స్కూటీపై వెళ్తున్న యువతిని అసభ్యంగా తాకాడు. దాంతో ఆమె స్థానికుల సాయంతో అతడికి దేహశుద్ధి చేసింది. నిందితుడి స్నేహితులు అక్కడికి చేరుకుని ఎదురుదాడికి దిగారు. అయినా యువతి వారిని కూడా చితకబాదింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్