ప్రియుడితో కలిసి భర్తను చంపి.. గోతిలో పాతిపెట్టింది

ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసి గోతిలో పాతిపెట్టింది. ఈ ఘటన కర్ణాటకలోని మద్దిహళ్లి గ్రామంలో చేటు చేసుకుంది. తన భర్త బాలణ్ణ (52) కనిపించడం లేదని భార్య మమత (27) పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మమత, అతని ప్రియుడు శ్రీసత్యసాయి జిల్లా హీరేతురుపి గ్రామానికి చెందిన మూర్తితో కలిసి ఇనుప చువ్వతో బాది చంపినట్లు తెలిసింది. ఈ మేరకు నిందితులు మమత, ప్రియుడు మూర్తిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్