ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం టీమిండియాతో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. భారత ఆల్ రౌండర్ శివమ్ దూబే తన తొలి ఓవర్‌లోనే వికెట్ సాధించాడు. దూబే వేసిన 10.3 ఓవర్‌కు సైమ్ అయూబ్ (21) అభిషేక్‌కు క్యాచ్ ఇచ్చాడు. అంతేకాకుండా ఫర్హాన్, అయూబ్ 72 పరుగుల (48 బంతుల్లో) భాగస్వామ్యానికి తెరపడింది. దీంతో 11 ఓవర్లకు పాక్ స్కోరు 96/2గా ఉంది.