ఆసియా కప్‌లో భాగంగా అబుదాబి వేదికగా శుక్రవారం ఒమన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. భారత స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 5 పరుగులకు ఔట్ అయ్యారు. షా ఫైజల్ వేసిన 1.3 బంతికి శుభ్‌మన్ గిల్ బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరారు. దీంతో షా ఫైజల్‌కు వికెట్ మెయిడిన్ ఓవర్ లభించింది. దీంతో 2 ఓవర్లకు భారత్ స్కోర్ 6/1గా ఉంది.