AP: త్వరలో కడప జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. 2024 ఎన్నికల్లో ఓటమి పాలైన రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామి రెడ్డి కూడా పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరు వైసీపీ కార్యక్రమాలకు, పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా, జగన్‌కు అత్యంత సన్నిహితుడుగా, గతంలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా పనిచేసిన శ్రీకాంత్ రెడ్డి ఇలా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వీరిద్దరూ త్వరలో పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం.