షాకింగ్: చనిపోయాడని అంత్యక్రియలు చేస్తే.. తిరిగొచ్చాడు

హరియాణాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. చనిపోయాడనుకున్న ఓ వ్యక్తి తిరిగి రావడంతో గ్రామస్థులు షాక్ అయ్యారు. ఝార్సా ప్రాంతానికి చెందిన పూజన్ ప్రసాద్ అనే వ్యక్తి కొన్ని రోజులు క్రితం అదృశ్యం అయ్యాడు. ఈ క్రమంలో తలలేని ఓ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పూజన్ కుటుంబానికి సమాచారమివ్వగా.. మృతదేహంపై గుర్తులు చూసి కుటుంబీకులు అంత్యక్రియలు చేశారు. మరుసటి రోజే ప్రసాద్ ఇంటికి రావడంతో అంతా అవాక్కయ్యారు. దీంతో తలలేని మృతదేహం ఎవరిదనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్