షాకింగ్.. 500 మీటర్లు వెనక్కి వెళ్లిన సముద్రం (వీడియో)

AP: అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది బీచ్ వద్ద షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నిత్యం అలలతో ఉప్పొంగే సముద్రం ఒక్కసారిగా 500 మీటర్ల దూరం వెనక్కి వెళ్లిపోయింది. ఒండ్రుమట్టితో తీరప్రాంతం నిండిపోయింది. మోకాళ్ల లోతు ఒండ్రుమట్టితో నిండిపోవడం మునుపెన్నడూ చూడలేదని గ్రామస్థులు చెబుతున్నారు. ఒక్కసారిగా సముద్రం వెనక్కి వెళ్లడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్