కుటుంబాన్ని కలుసుకుని.. భార్యాబిడ్డలను హత్తుకున్న శుభాంశు శుక్లా

భారత రోదసి చరిత్రలో తనపేరు లిఖించుకున్న వ్యోమగామి శుభాంశు శుక్లా ఎట్టకేలకు తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. బుధవారం హూస్టన్‌లోని పునరావాస కేంద్రంలో భార్య కమ్నా, కుమారుడు కైశ్‌ను కలిసి ఆనందంతో హత్తుకున్నాడు. దీనికి సంబంధించి శుభాంశు ఇన్‌స్టాలో ఫొటోలను పోస్టు చేశాడు. రెండు నెలల తర్వాత తన కుటుంబాన్ని చూడడం ఇదే తొలిసారి. హూస్టన్‌లోని పునరావాస శిబిరంలో మెడికల్‌ చెకప్‌లు పూర్తైన అనంతరం శుక్లా తన కుటుంబంతో కలిశాడు.

సంబంధిత పోస్ట్