TG: ఫిట్స్ రావడంతో కుప్పకూలిన ఓ యువకుడిని SI, కానిస్టేబుల్ కాపాడిన ఘటన వరంగల్ ఉర్సు గుట్ట వద్ద జరిగింది. గణేశ్ నిమజ్జనానికి వచ్చిన యువకుడికి ఫిట్స్ రావడంతో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న SI శ్రవణ్, కానిస్టేబుల్ చందూ వెంటనే స్పందించారు. అత్యవసర చికిత్స చేశారు. స్థానికులు సైతం సపర్యలు చేయడంతో అతడు స్పృహలోకి వచ్చాడు. బాధితుడికి దైర్యం చెప్పి అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ చందూ ఆ యువకుడిని భుజాలపై మోసుకెళ్లడంతో ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.