రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య బుధవారం సిద్దిపేట జిల్లా భూంపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 'స్వస్థ్ నారి-సశక్త్ పరివార్ అభియాన్' ప్రత్యేక వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మహిళల ఆరోగ్యం బలపడితే కుటుంబం బలపడుతుందని ఆయన అన్నారు. ఈ శిబిరంలో మహిళలకు ఆరోగ్య పరీక్షలు, రక్తహీనత నివారణ, గర్భిణీలకు కౌన్సిలింగ్, వ్యాధి నిరోధక టీకాలు, క్యాన్సర్ స్కానింగ్, రక్తదాన శిబిరాలు వంటి సేవలు అందిస్తారని తెలిపారు.