దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మంగళవారం నార్సింగి మండలం వల్లూరు గ్రామంలో లబ్ధిదారుడికి చెందిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇండ్లు లేని నిరుపేదలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడమే తన ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నార్సింగ్ మండల ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.