వర్షపు నీటితో తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన

సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో వర్షాలతో తడిసిపోయిన ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. తుపాను ప్రభావంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రోజులు గడుస్తుండడంతో ధాన్యం పాడైపోతోందని, కొనుగోలు ప్రక్రియపై అధికారులు మాటలకే పరిమితమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల రాస్తారోకోతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకుని రైతులతో చర్చలు జరిపి రాస్తారోకోను విరమింపజేశారు.

సంబంధిత పోస్ట్