గోసాన్ పల్లిలో ఇంట్లో దొంగతనం.. 19 తులాల బంగారం మాయం

దుబ్బాక మండలం గోసాన్ పల్లి గ్రామంలో ఇంటి తాళం పగులగొట్టి 19 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.30 వేల నగదు దొంగిలించబడ్డాయి. బాధితుడు అస్కనర్సింలు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం మధ్యాహ్నం కుటుంబంతో కలిసి సిద్దిపేట వెళ్లగా, మంగళవారం తిరిగి వచ్చి చూసేసరికి ఈ దొంగతనం జరిగినట్లు గుర్తించారు. బీరువా తాళం పగులగొట్టి, అందులో ఉన్న బంగారం, వెండి, నగదు అపహరించినట్లు బాధితుడు పేర్కొన్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్