తోగుట: అభివృద్ధి సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యము

తొగుట మండలంలోని ఎల్లారెడ్డిపేటలో సోమవారం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని, మొదటి విడతలో నియోజకవర్గానికి 8,500 ఇళ్లు మంజూరు అయ్యాయని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అనంతరం 23 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధి, సంక్షేమమేనని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్