బాలుడికి విషపురుగు కాటు: ప్రాణాలు కోల్పోయిన విషాదం

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం యూసుఫ్ ఖాన్పల్లి గ్రామంలో మంగళవారం రాత్రి ఏడాదిన్నర వయసున్న చాణక్య అనే బాలుడు ఇంటి పరిసరాల్లో ఆడుకుంటుండగా విష పురుగు కాటుకు గురయ్యాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడిని కుటుంబ సభ్యులు చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్లగా, పరిస్థితి విషమించడంతో ములుగులోని ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు బాలుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బుధవారం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం, బాలుడి తల్లి సంధ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్