సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డులో గురువారం తడిసిన ధాన్యాన్ని కలెక్టర్ హైమావతి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పోతారం (ఎస్) గ్రామం నుంచి వరద మార్కెట్లోకి రావడంతో ధాన్యం తడిసిందని, ఆర్డీవో రామ్మూర్తి, మార్కెట్ అధికారులు ప్రహరీని కూల్చి నీటిని బయటకు పంపించారని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తడిసిన, కొట్టుకుపోయిన, మొలకెత్తిన ధాన్యం వివరాలు నమోదు చేయాలని మార్కెటింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.