హుస్నాబాద్ లో విషాదం.. బొలెరో ఢీకొని టీ వ్యాపారి మృతి

హుస్నాబాద్ పట్టణంలో బొలెరో వాహనం ఢీకొని టీ వ్యాపారి పోగుల యాదగిరి (55) మృతి చెందారు. జ్యోతినగర్ కు చెందిన యాదగిరి, రిజిస్ట్రార్ ఆఫీస్ ఎదురుగా టీ కొట్టు నడుపుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ కు వెళ్లి వస్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన బొలెరో (TS 08 V 1925) వాహనం ఢీకొని 30 అడుగుల వరకు ఈడ్చుకెళ్లింది. తలకు, శరీర భాగాలకు తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగింది. స్థానికులు 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు.

సంబంధిత పోస్ట్