అకాల వర్షంతో అన్నదాతల ఆవేదన, పంటలకు ముప్పు

హుస్నాబాద్ నియోజకవర్గం, ఎల్కతుర్తి మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ అకాల వర్షం కురిసింది. ఉదయం కురిసిన వర్షం వల్ల పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కోతకు సిద్ధంగా ఉన్న పత్తి, వరి పంటలకు ఈ వర్షం వల్ల తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోసిన వరి ధాన్యం ఆరబెడుతున్న రైతులకు నష్టం వాటిల్లుతుందని, అన్నదాతలు ఆగమవుతున్నారని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడగా, చిరు వ్యాపారస్తులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్