రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలి

ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల మండలంలో రైతుల పత్తి, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, నష్టపోయిన పంటలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక అందించి తక్షణ నష్టపరిహారం అందించాలని బిజెపి మండల అధ్యక్షుడు జిన్నా భాస్కర్ తహసీల్దార్ మల్లయ్యను కోరారు. రైతులు కష్టించి పండించిన పంట చేతికొచ్చే సమయానికి వర్షాల వల్ల నష్టపోయారని, ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయం అందించాలని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్