రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

చిన్నశంకరంపేట మండల పరిధిలోని కొరివిపల్లిలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. నేపాల్‌కు చెందిన లాలు మండల్ (42) అనే హమాలి కార్మికుడు నడుచుకుంటూ వెళుతుండగా, వెనుక నుంచి వచ్చిన వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్