సంగారెడ్డి జిల్లా తళ్లపల్లి గ్రామంలో సర్పంచ్ పదవి కోసం ఒక యువకుడు తన ప్రేయసిని వివాహం చేసుకున్నాడు. బీసీ యువకుడు చంద్రశేఖర్ గౌడ్, ఎస్సీ కులానికి చెందిన తన ప్రేయసిని సర్పంచ్‌గా నిలబెట్టాలనే ఉద్దేశ్యంతో యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన గ్రామ రాజకీయాల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రేమ సంబంధం ఒక అవకాశంగా మారింది.