సంగారెడ్డి: వరదల్లో చిక్కుకున్న 45 మంది కాలనీవాసులు

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తొగర్‌పల్లిలో చెరువు పొంగిపొర్లడంతో వరద నీటిలో 45 మంది కాలనీవాసులు చిక్కుకున్నారు. రెండురోజులుగా రవాణా, విద్యుత్‌ పూర్తిగా నిలిచిపోయింది. వరద నీరు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. తమను కాపాడాలని ఆర్తనాదాలు చేస్తూ అధికారులు సమాచారం ఇచ్చారు. నాటు పడవల సాయంతో మత్స్యకారులు బాధితులను తరలిస్తుండగా, తహసీల్దార్‌ పోలీసులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు.

సంబంధిత పోస్ట్