సంగారెడ్డి: కానిస్టేబుల్ ఆత్మహత్య.. స్పందించిన సజ్జనార్

సంగారెడ్డి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కొఠారి సందీప్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో విషాదాన్ని రేపింది. కేవలం 23 ఏళ్ల వయసులోనే ఉద్యోగం సాధించిన సందీప్, ఆన్లైన్ గేమ్స్ మరియు బెట్టింగ్‌లకు బానిసై అప్పులపాలు కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఆర్థిక ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనపై సీపీ సజ్జనార్ స్పందిస్తూ, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన పోలీస్ ఉద్యోగి ఇలాంటి వ్యసనానికి బలి కావడం బాధాకరమని పేర్కొన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ ప్రమాదకరమని, అది జీవితాలను నాశనం చేస్తోందని హెచ్చరించారు. సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని, ఆత్మహత్య పరిష్కారం కాదని సూచించారు.

సంబంధిత పోస్ట్