సిద్ధిపేట జిల్లా కలెక్టర్ హైమావతి మంగళవారం సాయంత్రం బాలసదనంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పిల్లలకు రాత్రి వేళ అందించే భోజన ప్రక్రియను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మెనూ ప్రకారమే టిఫిన్, లంచ్, స్నాక్స్, డిన్నర్ అందించాలని, పాలు, పండ్లు తప్పనిసరిగా పౌష్టికాహారంలో భాగంగా ఇవ్వాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. పిల్లలకు ఎలాంటి సమస్య ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.