అస్సాం గాయకుడు జుబీన్ గార్గ్ మృతి కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా, కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి. గార్గ్ భద్రతా సిబ్బంది ఖాతాల్లో రూ.1 కోటి లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారి ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాయకుడి బ్యాండ్‌మేట్ శేఖర్‌జ్యోతి గోస్వామి తెలిపిన వివరాల ప్రకారం, గార్గ్‌కు ఆయన మేనేజర్, ఫెస్టివల్ నిర్వాహకులు విషమిచ్చి ప్రమాదంలా చూపించే ప్రయత్నం చేసి ఉండవచ్చన్నారు. కాగా, ఈ కేసుపై దర్యాప్తు సాగుతోంది.