అస్సాం గాయకుడు జుబీన్ గార్గ్ (52) అంతిమయాత్రలో లక్షలాది మంది అభిమానులు పాల్గొన్నారు. గువాహటిలోని అర్జున్ భోగేశ్వర్ బారువా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో అభిమానులు ఎండ, వానను లెక్కచేయకుండా ఆయన చిత్రాలు, పాటలతో నివాళులర్పించారు. ఈ అంతిమయాత్ర లిమ్కా బుక్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. మైఖేల్ జాక్సన్, పోప్ ఫ్రాన్సిస్, క్వీన్ ఎలిజబెత్–2 తర్వాత అత్యధికమంది పాల్గొన్న అంత్యక్రియగా నిలిచింది. కాగా, ప్రభుత్వ లాంఛనాలతో జుబీన్‌కు మంగళవారం అంత్యక్రియలు జరిపారు.