జగిత్యాల పట్టణంలో సేవాభారతి ఆధ్వర్యంలో గ్రామీణ నిరుపేద విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసానికి పట్టణంలోని బచ్ పన్ స్కూల్ యాజమాన్యం మంగళవారం రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్థిక సాయం అందించారు. రైతుల వేషధారణలో విద్యార్థులు కూరగాయలు విక్రయించారు. ఈ కార్యక్రమం ద్వారా రూ. 11,346 సమకూరింది. కాగా ఆ మొత్తాన్ని వాల్మీకి ఆవాసానికి సహాయంగా అందజేశారు.