శుక్రవారం రోజున జపాన్ కరాటే అసోసియేషన్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రధాన శిక్షకులు, పరీక్షా నిర్వకులు రాపోలు సుదర్శన్ మాస్టర్ ఆధ్వర్యంలో కరాటే అసోసియేషన్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో నిర్వహించిన కరాటే బ్లాక్ బెల్ట్ పరీక్షా మహిళా విభాగంలో ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన బి. విశాల ఉత్తీర్ణత సాధించింది. మరియు అంతర్జాతీయ జపాన్ బ్రౌన్ బెల్ట్ పరీక్షలో బాలుర విభాగంలో కె. హర్షవర్ధన్, కె. హేమంత్ ఉత్తీర్ణత సాధించారు. అనంతరం మాస్టర్ రాపోలు సుదర్శన్ విద్యార్థులకు బహుమతులు ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ప్రధాన శిక్షకులు ప్రవీణ్ కుమార్, కరాటే శిక్షకులు పవన్ కళ్యాణ్, కరాటే విద్యార్థులు పాల్గొన్నారు.