కోరుట్ల: నవోదయ విద్యాలయ భవనం పనులను పరిశీలించిన కలెక్టర్

జగిత్యాల జిల్లా కోరుట్లలో నూతనంగా ఏర్పాటు చేసిన నవోదయ విద్యాలయ భవనము పనులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మంగళవారం పరిశీలించారు. పెండింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. వారి వెంట కోరుట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి జీవాకర్ రెడ్డి, కోరుట్ల తహశీల్దార్ కృష్ణ చైతన్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్