ఇటీవలే హైదరాబాద్ లో నిర్వహించిన జె. కె. ఐ షోటోకాన్ కరాటే అసోసియేషన్ హైదరాబాద్ బ్రాంచ్ అధ్వర్యంలో నిర్వహించిన బెల్ట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 14 మంది విద్యార్థులకు గురువారం రోజున కరాటే కోచ్ మాస్టర్ పవన్ కళ్యాణ్ చేతులమీదుగా బెల్టులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇలాంటి కరాటే విద్యను యువతి యువకులు నేర్చుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన శిక్షకులు రాపోలు సుదర్శన్ మాస్టర్, జగిత్యాల జిల్లా ప్రధాన శిక్షకులు ప్రవీణ్ కుమార్ మాస్టర్ లు హర్షం వ్యక్తం చేసి కొనియాడారు.