సుల్తానాబాద్: ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

సుల్తానాబాద్ మండల కేంద్రంలోని జవహర్ నగర్ 4వ వార్డులో గురువారం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పెగడ పరశ రాములు ఆధ్వర్యంలో హైదరాబాద్ వెస్ట్ మారేడ్ పల్లికి చెందిన పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలను అందించారు. ఈ కార్యక్రమంలో వైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్, యువకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్