పోషణ్ మాస్ సమీక్ష సమావేశంలో కలెక్టర్

బాలికలు, గర్భిణులు, బాలింతలు సమతుల ఆహారం తీసుకునేలా అవగాహన కల్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. పోషణ్ మాసం పై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఎనిమియా నిర్ధారణ పరీక్షలపై ఆరా తీశారు. ఇప్పటివరకు ఎంతమందికి పరీక్ష చేశారో అనే వివరాలు తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్