భీమన్న గుడిలో భక్తుల సందడి

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న భీమన్న గుడిలో ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు లఘు దర్శనం ద్వారా రాజన్న స్వామిని దర్శించుకుని, భీమన్న ఆలయంలో కోడె మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా కార్తీక దీపాలు వెలిగించి స్వామి సేవలో తరించారు. అందరినీ చల్లంగా చూడాలని భక్తులు స్వామిని వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్