సోమవారం, ప్రభుత్వ విప్ మరియు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉదయం 8:30 గంటలకు నాంపల్లిలో, 9 గంటలకు సంకేపల్లిలో పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తారు. 9:45 గంటలకు సుద్దాల గ్రామంలో మరో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 10:15 గంటలకు మల్కపేట రిజర్వాయర్ లో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో సమావేశంలో పాల్గొంటారని ఆదివారం రాత్రి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రకటించింది.